@import url(http://fonts.googleapis.com/earlyaccess/notosanstelugu.css); @import url(http://fonts.googleapis.com/earlyaccess/nats.css);

Google Analytics

Friday, July 24, 2015

ఏదీ … దూకుడు!

మెట్రో రైలు ప్రాజెక్టు వేగం తగ్గిందా?
ప్రధాన నగరంలో వేధిస్తున్న సమస్యలు
పనులు నెమ్మదించాయంటున్న గణాంకాలు
ఈనాడు, హైదరాబాద్

ప్రారంభంలో మాదిరి నగరంలో మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదా? ఇదివరకు రాత్రికి రాత్రే చకచకా స్థంబాలు వేలిసేవి. పనులు హడావుడిగా కనిపించేవి. ఆ వేగానికి పలు జాతీయ, అంతర్జాతీయ రికార్డులు నమొదయ్యాయి. ఇటీవల కాలంలో ప్రధాన నగరంలో ఎదురవుతున్న పలు ఇబ్బందుల వాళ్ళ మెట్రో పనుల్లో వేగం తగ్గిందన్న భావాన వ్యక్తమవుతోంది.
అపాయింటెడ్ తేదీ 2012 జూన్ 5 … అయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ రెండు నెలల ముందే పనులకు శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఐదేళ్ళలో ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒప్పందం. అందుకే ఏప్రిల్ చివరలో పనులు మొదలు పెట్టింది. ఉప్పల్ - నాగోల్ మార్గంలో తొలి పునాది పడింది. ఆపై వెయ్యి పునాదుల మార్కును 2013 నవంబర్ 4 నాటికి చేరుకుంది. దాదాపు 18 నెలల కాలంలోనే వీటిని పూర్తి చేశారు. అదే విధంగా జరిగితే ఈ పాటికే రెండు వేల పునాది పనులు పూర్తవ్వాలి. కానీ 21 నెలలైనా 1,936 మాత్రమె పూర్తి చేయగలిగారు. మెట్రో స్థంబాల పనుల పురోగతి మాత్రం ప్రారంభం నుంచి ఒకే వేగంతో సాగుతున్నాయి. ఇప్పటి వరకు 1,824 స్థంబాల నిర్మాణం పూర్తయింది.
ఎందుకిలా .. ?
సాధారణంగా పనులు జరిగే కొద్దీ వేగం పెరగాలి. ప్రారంభంలో కొత్త కాబట్టి ఎంగినీర్లు, సిబ్బంధి ఎక్కువ సమయం తీసుకోవటం సహజం. మొదట్లో ఒక స్పాన్ను బిగించేందుకు రెండు వారాలు పడితే సమయం గడిచేకొద్దీ ఆ అనుభవంతో అందులో సగం సమయంలోనే పూర్తి చేస్తారు. భద్రతాపరంగా రాజీ లేకుండానే వీటిని చేయాలి. ఒక ప్రాంతంలో పూర్తయితే పూర్తిగా వేరే ప్రాంతంపై దృష్టి పెట్టె అవకాశం ఉంటుంది. వీటన్నింటితో వేగం పెరగాలి కానీ గణాంకాలు మాత్రం మరోలా చెబుతున్నాయి. ప్రస్తుతం పనులు ప్రధాన నగరంలో చేపడుతుండటంతో ఇక్కడ పలు సవాళ్లు మందగమనానికి కారణమని నిర్మాణ సంస్థ అంటోంది. ప్రారంభంలో ఎలాంటి అవరోధాలు లేని ప్రాంతంలో పనులు చేపట్టారు. మూడు కారిడార్లలో అవకాసం ఉన్న చోస్తాల్లా పూర్తి చేశారు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ కోర్ ఏరియాలోనే ఉన్నాయి. స్పాన్ల పనుల్లో మందగమనానికి కారణం నిర్మాణ సమష్ట దృష్టి అంతా ఎప్పుడు రైల్వే వంతెనలపై ఉండటమేనని ఎల్ అండ్ టీ అధికారి ఒకరు తెలిపారు. ఒక్కో అర్వోబీ పూర్తి చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుంది. ఇప్పటికే భరత్ నగర్లో ఒకటి పూర్తయింది. రెండోది ఆలుగడ్డ బావి దగ్గర ప్రారంభించేందుకు కసరత్తు మొదలెట్టారు. కూడళ్ళలోనూ పంజాగుట్ట, మోజంజాహి మార్కెట్ వద్ద ఆబ్లిగేటరీ స్పాన్లు నిర్మించేందుకు ఆరు నెలలు పడుతుంది. ఈ కారణాల వల్ల గణాంకాలలో వేగం తగ్గినట్టు అనిపించినా .. పనులు ఇదివరకు మాదిరే జరుగుతున్నాయని ఎల్ అండ్ టీ అధికారి చెప్పారు.
స్పాన్లలో మందగమనం
రెండు స్థంబాల మధ్య గడ్డర్ల సాయంతో నిర్మిస్తున్న స్పాన్ల పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదు. వెయ్యి స్పాన్లను 20 నెలల్లో పూర్తి చేశారు. సరిగ్గా ఏడాది కిందట ఇది అంతరాతీయ రికార్డు. ఇంత తక్కువ సమయంలో ఎవరూ ఇన్ని పూర్తి చేయలేదు. ఆ తర్వాత పనుల్లో వేగం మందగించింది. పది దాటి పన్నెండు నెలలు కావోస్తున్నాయి. దాదాపు 600 స్పాన్లు పూర్తి కావాలి, 517 మాత్రమే పూర్తయ్యాయి.

2 comments:

  1. enti sudden ga social issues meedha padav?

    ReplyDelete
    Replies
    1. Social issues ani kaadu ... Google Noto Telugu font ela untundo test cheddamani raasanu

      Delete